Ys Jagan : జగన్ లెక్కలు ఇవేనట.. ఈసారి అంచనాలు తప్పే ఛాన్స్ లేదట

వైసీపీ అధినేత జగన్ కు ఈసారి ఎన్నికలు చావో రేవో అని చెప్పక తప్పదు.

Update: 2026-03-02 08:54 GMT

వైసీపీ అధినేత జగన్ కు ఈసారి ఎన్నికలు చావో రేవో అని చెప్పక తప్పదు. కూటమి కలసి ఉన్నంత వరకూ తాను గెలవడం కష్టమేనని జగన్ కు తెలియంది కాదు. అలాగని జగన్ కు అధికారం తనదేనన్నధీమా కూడా అంతే స్థాయిలో ఉంది. అధికార పార్టీలపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. తన పార్టీకి సొంత బలం నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది. దానికి తోడు అధికార పార్టీ పై వ్యతిరేకత తోడయితే విజయం ఖాయమన్నలెక్కల్లో ఉన్నారు. తన ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు బేరీజు వేసుకుంటారు.అదే తన గెలుపునకు ప్రధాన కారణమని వైఎస్ జగన్ తన సన్నిహితుల వద్ద కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పాదయాత్రతో పాటు...
అధికార పార్టీపై వ్యతిరేకతతో పాటు తాను ఏడాదిన్నర తర్వాత చేపట్టబోయే పాదయాత్ర కూడా పార్టీకి మంచి మైలేజీ తెచ్చిపెడుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. పాదయాత్రతో కొన్ని వర్గాలను ఫ్యాన్ పార్టీ వైపునకు తిప్పుకోగలనన్న ధీమాలో ఉన్నారు. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేల పై ఉన్నవ్యతిరేకత తన విజయానికి సానుకూలత తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. కూటమిలోని పార్టీ నేతలే ఎమ్మెల్యేలు, అధికారుల అవినీతిపై చేస్తున్న బహిరంగ విమర్శలు తన గెలుపునకు ప్రధాన కారణం కానున్నాయని కూడా జగన్ అంచనా వేసుకుంటున్నారు. దీనికి తోడు పేద,మధ్య తరగతి ప్రజలు కూడా గత ఎన్నికల్లో దూరమైన వారు తిరిగి తనవైపునకు వస్తారని బలంగానమ్ముతున్నారు.
కేంద్రంలో నాయకత్వంతోనూ...
ఇక జగన్ మరొక ధీమా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. కూటమిలో మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ బీజేపీ తనకు మేలు చేయకపోయినా, నష్టం చేయదన్న అంచనాలో జగన్ ఉన్నారని తెలిసింది. అందుకే బేషరతుగా బీజేపీకి జగన్ మద్దతు అన్ని విషయాల్లో ఇస్తూ వస్తున్నారు. అదీ ఇదీ కాదు.. కేంద్రం ఏదంటే అటే జగన్ మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ కేంద్ర నాయకత్వంలో తన పట్ల సానుకూలత, సానుభూతిగా ఉన్నారని జగన్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ను వ్యతిరేకించే తనను బీజేపీ దూరం చేసుకోగలదని కూడా జగన్ భావన.అందుకే ఎటు చూసినా తన గెలుపునకు అన్ని కారణాలు, అన్నిఅంశాలు దోహదపడతాయనుకుంటున్నారు. అందుకే తరచూ జగన్ వచ్చేఎన్నికల్లో గెలుపు మనదేనంటూ పదే పదే ప్రకటిస్తున్నారనిపిస్తుంది.



Tags:    

Similar News