గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో యోగాంధ్ర

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది

Update: 2025-06-21 04:34 GMT

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఒకేసారి.. ఒకే చోట 3.20 లక్షల మంది యోగాసనాలు చేయడంతో ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సర్టిఫికేట్ ను మంత్రి నారా లోకేశ్, సత్యకుమార్ లకు విశాఖలో అప్పగించారు. గతంలో ఉన్న రికార్డులను విశాఖ యోగాంద్ర బద్దలు కొట్టిందని తెలిపారు.

ధృవపత్రాలను అందచేసి...
ఈ మేరకు ధృవపత్రాలను గిన్నిస్ బుక్ ఆఫ్ సంస్థ ప్రతినిధులు అందచేశారు. ఒకేసారి ఇరవై వేల మందితో గిరిజన విద్యార్థులు కూడా సూర్యనమస్కారాలు చేయడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. ఈ రెండింటికి సంబంధించిన ధృవపత్రాలను గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి మంత్రులు అందుకున్నారు.


Tags:    

Similar News