హైకోర్టులో మిధున్ రెడ్డికి కొంత ఊరట

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి కొంత ఊరట లభించింది.

Update: 2025-04-17 12:02 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి కొంత ఊరట లభించింది. మద్యం కేసులో సిట్ విచారణకు న్యాయవాదిని తనతో పాటు తీసుకెళ్లవచ్చని పేర్కొంది. లిక్కర్ స్కాంలో న్యాయవాదులను అనుమతించాలని మిధున్ రెడ్డి వేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు రావాలని సిట్ మిధున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

న్యాయవాదిని...
సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని, అయితే న్యాయవాది మిధున్ రెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డు చేసే సమయంలో జోక్యం చేసుకోకూడదని తెలిపింది. సిసీటీవీ కెమెరాలు ఉన్న చోట మాత్రమే మిధున్ రెడ్డిని విచారించాలని సిట్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిధున్ రెడ్డికి కొంత వరకూ ఊరట దక్కినట్లయింది.


Tags:    

Similar News