YSRCP : వైసీపీ ఎమ్మెల్సీ పై వేటు
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు మండలి నోటిఫికేషన్ వెలువరించింది
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు మండలి ఛైర్మన్ ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేశారు. జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. అయితే కొంత కాలం క్రితం ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
పార్టీ ఫిరాయింపులతో...
ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారంటూ జంగా కృష్ణమూర్తిపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగియడంతో నేడు ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి అనర్హుడిగా పేర్కొంటూ శాసనమండలి నుంచి నోటిఫికేషన్ విడుదలయింది. వైసీపి నుంచి జంగా కృష్ణమూర్తి గురజాల టిక్కెట్ ను ఆశించి భంగపడి టీడీపీలోకి మారారు.