దేశం విడిచి వెళ్లకూడదు.. దేవినేని అవినాష్ కు సుప్రీం ఆదేశం
దేవినేని అవినాశ్ తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది
దేవినేని అవినాశ్ తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. దేవినేని అవినాశ్ తో పాటు పిటిషన్లు దాఖలు చేసినవారిలో నందెపు జగదీశ్, మన్యం జగదీశ్, గందెల రమేశ్ తదితరులకు రిలీఫ్ చిక్కింది. వీరికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే జారీ అయిన ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింద.ి
బెయిల్ పొడిగిస్తూ...
ముందస్తు బెయిల్ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం పలు షరతులు విధించింది. విచారణకు సహకరించాలని పిటిషనర్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ సుప్రింకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ ముగిసినట్లయిందిి.