Ys Jagan : 31న నెల్లూరుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 31వ తేదీన నెల్లూరులో పర్యటించనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 31వ తేదీన నెల్లూరులో పర్యటించనున్నారు. ఈనెల 31వ తేదీ ఉదయం 9:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరుకి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత హెలిపాడ్ నుంచి నేరుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించనున్నారు.
పరామర్శించి...
ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి నుంచి కొత్తూరులోని నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని తెలిసి పోలీసులకు స్థానిక వైసీపీ నేతలు పోలీసుల అనుమతిని కోరారు.