Ys Jagan : ఆంక్షల మధ్య నేడు జగన్ నెల్లూరు పర్యటన

వైసీపీ అధినేతే వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-07-31 01:52 GMT

వైసీపీ అధినేతే వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసుల ఆంక్షల మధ్య ఈ పర్యటన సాగనుంది. ఉదయం 9 గంటలకు తాేడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాపర్ట్ లో బయలుదేరనున్న వైఎస్ జగన్ పదిన్నర గంటలకు నెల్లూరుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా నెల్లూరు జిల్లా జైలులో ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డిని పరామర్శించనున్నారు.

కొందరికే అనుమతి...
హెలిప్యాడ్ వద్దకు పది మందిని, , ములాఖత్ కు ముగ్గురిని మాత్రమే పోలీసులు అనుమతించారు. తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి ఆయనను పరామర్శిస్తారు. ఆయన ఇంటివద్దకు వంద మందికి మించి ఉండకూడదని తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పార్టీ కార్యకర్తలను తాము కట్టడి చేయలేమని చెబుతున్నారు. దీంతో కొంత టెన్షన్ మధ్య జగన్ పర్యటన సాగనుంది. నెల్లూరు నుంచి నేరుగా హెలికాప్టర్ లో బెంగళూరుకు జగన్ బయలుదేరి వెళ్లనున్నారు.


Tags:    

Similar News