Ys Jagan : నేడు విజయవాడకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Update: 2025-07-28 02:07 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు. ఉదయం 9.10 గంటలకు బెంగళూరులో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. నేడు ముఖ్యనేతలతో జగన్ సమావేశం కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది.

రేపు పీఏసీ సమావేశం...
ఈ సమావేశంలో ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యాచరణపై చర్చించి కార్యక్రమాలను రూపొందించే అవకాశముంది. వరసగా వైసీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ లపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాజకీయ పరిణామాలపై పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చించి జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.


Tags:    

Similar News