జగన్ నేడు కీలక సమావేశం
వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఈరోజు సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఈరోజు సమావేశం కానున్నారు. ప్రధానంగా గృహసారధుల నియామకంపై ఎమ్మెల్యేలను అడిగి పురోగతిని అడిగి జగన్ తెలుసుకోనున్నారు. జనవరి చివరి నాటికే యాభై ఇళ్లకు ఇద్దరు గృహసారధులను నియమించాలని జగన్ గత సమావేశంలో ఎమ్మెల్యేలను, ఇన్‌ఛార్జులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
గృహసారధులపై...
అయితే దీనిపై జగన్ ఈరోజు సమీక్ష చేయనున్నారు. దీంతో పాటు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై కూడా సమీక్ష చేయనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సమావేశంలో జగన్ ప్రస్తావించే అవకాశముంది. కొందరి ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇవ్వనున్నారని తెలిసింది. పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు కష్టమేనని నేరుగానే చెప్పనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ చర్చించనున్నారు.