Ys Jagan : మళ్లీ బెంగళూరుకు జగన్.. హైదరాబాద్‌కు అందుకే వెళ్లడం లేదా?
వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లారు. ఆయన బెంగళూరులోనే ఎక్కువ సేపు ఉంటున్నారు.
ycp chief ys jagan
వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లారు. ఆయన బెంగళూరులోనే ఎక్కువ సేపు ఉంటున్నారు. అక్కడ తన సొంత నివాసంలోనే జగన్ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఓటమి చెందిన తర్వాత హైదరాబాద్ కాకుండా బెంగళూరులోనే ఎక్కువ సేపు కుటుంబంతో గడుపుతున్న జగన్ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వెళుతున్నారు.
నిన్న మీడియాతో మాట్లాడి...
నిన్న తిరుమల లడ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడిన జగన్ అనంతరం తిరిగి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత పదిసార్లు జగన్ బెంగళూరుకు పయనమై వెళ్లారు. అక్కడే ఉంటున్నారు. అవసరమైతే తప్ప ఆంధ్రప్రదేశ్ కు రావడం లేదు. హైదరాబాద్ కు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు.