Ys Jagan : అధికారంలోకి రావడం ఖాయం.. సినిమా చూపించడం ఖాయం

వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెంటపాళ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు

Update: 2025-06-18 12:32 GMT

వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెంటపాళ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కమ్మ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతుందని ఆరోపించారు. పోలీసు అధికారులు కొందరు ఇందుకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఖచ్చితంగా చూపుతామని హెచ్చరించారు. కమ్మ నేతలు చంద్రబాబుకు మాత్రమే ఊడిగం చేయడానికి పుట్టారా? అని జగన్ ప్రశ్నించారు. కమమ్మ నేతలు వైసీపీలో ఉంటే నీకేం అభ్యంతరం అనిజగన్ చంద్రబాబును ప్రశ్నించారు.

కమ్మ నేతలే టార్గెట్...
పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అబ్బయ్య చౌదరి, బొల్లినేని బ్రహ్యయ్య నాయుడు, నంబూరి శంకరరావు లాంటి నేతలను అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. మరో నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని, అంతకు అంత చూపుతామని జగన్ హెచ్చరించారు. అలాగే పోలీసు అధికారులకు కూడా జగన్ హెచ్చరించారు. చంద్రబాబు శాశ్వతంగా అధికారంలో ఉండరని, ఇప్పుడు అక్రమ కేసులు పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టప్రకారం ఎక్కడ ఉన్నా చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు.


Tags:    

Similar News