Ys Jagan : శ్రావణ మాసం..జగన్ గేట్లు ఓపెన్ చేస్తున్నారటగా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొందరు నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Update: 2025-07-28 09:04 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొందరు నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికలకు నాలుగేళ్ల ముందు నుంచే చేరికలను షురూ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొందరు నేతలను బెంగళూరుకు పిలిపించుకుని చేరికలకు ఓకే చేసినట్లు సమాచారం. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలుండటంతో ప్రధానంగా చేరికలకు మంచి సమయమని భావించి నేతలు కూడా బెంగళూరుకు వెళుతున్నారు. బెంగళూరులో నిన్నటి వరకూ ఉన్న జగన్ ను కలిసిన నేతలకు జగన్ ఓకే చెప్పారని తెలిసింది. రేపు జరగనున్న పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలోనూ ఈ చేరికలపై చర్చించి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే చేరికలకు ఇప్పటికే ఓకే చెప్పిన జగన్ పీఏసీ నేతలకు సూత్రప్రాయంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

సీనియర్లకు అవకాశం...
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను అందులోనూ సీనియర్లను చేర్చుకోవడం ద్వారా పార్టీకి కొంత బలం తేవాలని చూస్తున్నారు. ప్రజల్లోనూ వారికి ఉన్న పాజిటివ్ థృక్పధం ఉన్న నేపథ్యంలో వారిని పార్టీలోకి తీసుకుంటే ఇటు పార్టీతో పాటు అటు జిల్లాలోనూ పార్టీ బలం పుంజుకుంటుందని జగన్ అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా లెక్కవేసుకుంటూ చేరికలకు జగన్ ఓకే చెబుతన్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యనేతలు బెంగళూరుకు వెళ్లి జగన్ తో చర్చించి వచ్చారని, వారిని పార్టీలో సాదరంగా ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలతో పాటు రాయలసీమకు చెందిన నేతలు కూడా ఉన్నారని తెలిసింది.
నేతలతో చర్చలు...
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత తన వారసుడిని పార్టీలోకి చేర్పించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తాను రాజకీయాలకుదూరంగా ఉంటూనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆయన తన వారసుడిని వైసీపీలో చేర్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కుమారుడితో పాటు ఆ సీనియర్ నేతను కూడా జగన్ పార్టీలోకి ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు. మొత్తం ముగ్గురు నేతల వరకూ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల రాయలసీమలో సుగవాసి సుబ్రహ్మణ్యం చేరికతో కొంత బలం పెరిగిందని భావిస్తున్నట్లు అంచనా వేస్తున్న జగన్ సీమలో మరికొందరు నేతలను పార్టీలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సీమ కాంగ్రెస్ నేతలను గతంలో పార్టీలో చేరిన సాకే శైలజానాధ్ టచ్ లోకి వెళ్లి వారికి జగన్ ద్వారా మెసేజ్ అందచేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద శ్రావణ మాసంలో వైసీపీలో చేరికలు భారీగా ఉంటాయన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News