Ys Jagan : వైఎస్ జగన్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు భద్రత మరింత పెంచాలంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు.

Update: 2025-05-09 04:21 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు భద్రత మరింత పెంచాలంటూ హైకోర్టులో పిటీషన్ వేశారు. తనకు జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనకు ప్రాణ హాని ఉందని, తాను ప్రజల్లో పర్యటిస్తున్నప్పుడు తగిన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన పిటీషన్ లో తెలిపారు.

జామర్లతో కూడిన వాహనం...
తనకు సీఆర్పీఎఫ్ లేదా ఎన్.ఎస్.జిలతో తగిన భద్రత కల్పించాలని వైఎస్ జగన్ కోరారు. అంతేకాకుండా తనకు జామర్లతో కూడిన వాహనాన్ని కూడా సమకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ లో తెలిపారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పెట్టుకునేందుకు అనుమతించాలని జగన్ తన పిటీషన్ లో కోరారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News