నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది.

Update: 2022-09-14 03:03 GMT

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లను పది అడుగులు ఎత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,23,613 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,13,463 క్యూసెక్కులు ఉంది.

విద్యుత్తు ఉత్పత్తితో....
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 213 టీఎంసీలుగా ఉంది. దీంతో పాటు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్పి జరగుతోంది.


Tags:    

Similar News