తొలి ఓటు వేసిన జగన్

ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఓటింగ్ ప్రారంభమయింది

Update: 2023-03-23 04:34 GMT

ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఓటింగ్ ప్రారంభమయింది. తొలి ఓటును ముఖ్యమంత్రి జగన్ వేశారు. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తమ ఓటు హక్కును వినియోగించు కోవడంతో ప్రారంభమైన ఓటింగ్ తర్వాత వరసగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు.

11 గంటలకు చంద్రబాబు...
ముఖ్యమంత్రి జగన్ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమరనాధ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో కలసి టీడీపీ నేతలు 11 గంటల తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


Tags:    

Similar News