Pawan Kalyan : పవన్ కల్యాణ్ తో విశ్వహిందూ పరిషత్ నేతల భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ నేతలు సమావేశమయ్యారు

Update: 2025-09-02 02:07 GMT

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ నేతలు సమావేశమయ్యారు. విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాందే మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు.

డిక్లరేషన్ గురించి...
ఈ ఏడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి విశ్వహిందూ పరిషత్ నేతలు వివరించారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఏపీ, తెలంగాణ క్షేత్ర కార్యదర్శి టి.సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి వి.దుర్గా ప్రసాదరాజు పాల్గొన్నారు.


Tags:    

Similar News