జగన్ కు షాకిచ్చిన ఉద్యోగులు
గ్రామ, వార్డు సెక్రటరీలు ప్రొహిబిషన్ డిక్లేర్ చేేయకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఆందోళన చేసేందుకు సిద్దమవుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు పరిపాలనను మరింత చేరువకు తీసుకెళ్లడానికి వీరిని నియమించారు. ప్రతి గ్రామం, పట్టణంలో వీరి ద్వారానే పౌర సేవలు అందుతున్నాయి. అయితే వీరికి ప్రొహిబిషన్ డిక్లేర్ చేేయకపోవడంతో వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దశల వారీగా ఆందోళన చేసేందుకు సిద్దమవుతున్నారు.
వాట్సప్ గ్రూపుల నుంచి.....
90 శాతం మంది ఉద్యోగులు పంచాయతీ జిల్లా అధికారి వాట్సప్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయ్యారు. అయితే ప్రభుత్వం వీరి నిరసనపై సీరియస్ అయింది. విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వాట్సప్ గ్రూపుల నుంచి సెక్రటరీలు ఎగ్జిట్ అవుతుండటంతో సీనియర్ అధికారులు సీరియస్ అవుతున్నారు.