Vemireddy : వైసీపీలో చేరబోం : వేమిరెడ్డి దంపతులు
తాము టీడీపిని వీడుతున్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వేమిరెడ్డి దంపతులు అన్నారు
తాము టీడీపిని వీడుతున్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వేమిరెడ్డి దంపతులు అన్నారు. తాము అయోధ్య రామిరెడ్డిని కలిసి చర్చించామన్న వార్తలు అవాస్తవమని, తాము కూటమి ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నామని వారు చెప్పారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము టీడీపీలోనే కొనసాగుతామని అన్నారు. రాజధాని అంటేనే వైసీపీకి స్పష్టత లేదని, మావిగన్ అంటే జనం నవ్వుతున్నారని వేమిరెడ్డి దంపతులు అన్నారు.
మత్స్యకారులకు అన్ని వసతులు...
మత్స్యకారులకు అన్ని వసతులు కూటమి ప్రభుత్వం కల్పిస్తోందన్న వారు మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాగర్ డిఫెన్స్ కంపెనీతో మత్స్యకారులకే ప్రయోజనం అని వేమిరెడ్డి దంపుతులు తెలిపారు. హైస్పీడ్ బోట్లతో తీర గస్తీ మరింత పెంచామని వారు వివరించారు.