జగన్ తో వైరం నాకు నష్టమే

వైఎస్ జగన్ తో వివాదం తనకు రాజకీయంగా కలిసి రాలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు

Update: 2026-04-05 12:07 GMT

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వివాదం తనకు రాజకీయంగా కలిసి రాలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆ వివాదం కారణంగా తాను చాలా నష్టపోయానని తెలిపారు. ఎవరో కిరీటం పెడతారని తాను జగన్ తో గొడవ పెట్టుకోలేని రఘురామ కృష్ణరాజు అన్నారు.

మూడేళ్లు ఒంటరి పోరాటం చేసినా...
జగన్ పై తాను మూడేళ్లు ఒంటరి పోరాటం చేశానని, అయితే ఎన్నికలకు 18 రోజుల ముందు వరకు నాకు సీటు వస్తుందో రాదో తెలియదని రఘురామకృష్ణరాజు చెప్పారు. 174వ సీటుగా తనకు చంద్రబాబు కేటాయించారన్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం తనకు లభించిన హోదాపై సంతృప్తిగానే ఉన్నానంటూ ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.


Tags:    

Similar News