Vijayawada : నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ
విజయవాడలో ఉగ్రవాదుల లింకు కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది
విజయవాడలో ఉగ్రవాదుల లింకు కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. టెర్రరిస్టులతో సంబంధాలున్న నేపథ్యంలో ఐదుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ గడువు నేటితో ముగియనుంది. మొత్తం ఐదుగురు నిందితులను ఐదు రోజుల పాటు ప్రశ్నించారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని...
విజయవాడలో ఉంటూ పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు నెరుపుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారికి టచ్ లో దేశంలో ఇంకా ఎవరెవరున్నారు? నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని కోణాల్లో పోలీసులు విచారించారు. దేశంలో అరెస్టయిన మిగిలిన ఏడుగురితో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు తమ విచారణలో ఆరా తీశారు.