Earth Quake : అల్లూరి జిల్లాలో భూ ప్రకంపనలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి

Update: 2026-04-05 03:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూప్రకంపనలు కలకలం రేపాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 11:30 గంటలకు అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట ,ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

ముప్ఫయి సెకన్లు...
సుమారు 30 సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలో నిద్రిస్తున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఎన్నడూలేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెబుతున్నారు.


Tags:    

Similar News