Vemireddy Prashnathi reddy : ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఈమెను చూసి నేర్చుకోండి.. చంద్రబాబు క్లాస్

కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారి గా గెలిచారు

Update: 2025-06-15 07:52 GMT

నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన రాజకీయాల్లోకి రావడంతో ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేకుండా పోయింది. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ గా ఎంపికయ్యారు. తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలిపై విసుగు చెంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ టీడీపీ నుంచి లభించింది. పారిశ్రామికవేత్తగా ఎదిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన వీపీఆర్ సంస్థ ద్వారా నెల్లూరులోని అనేక నియోజకవర్గాలలో మంచినీటితో పాటు ఇతర ప్రజాసమస్యలను పరిష్కరించేదిశగా అడుగులు వేశారు.

కోవూరు నుంచి గెలిచి...
దీంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం సాధించారు.వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులోనూ తాము ఇష్టపడే కోవూరు నియోజకవర్గంలో గెలవడంతో నిరంతరం అక్కడే పర్యటిస్తూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో డబ్బున్న వాళ్లు ఎన్నికయితే ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండరన్న అభిప్రాయాన్ని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెరిపేయగలిగారు. ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో నెలకొన్న రహదారులు, మంచినీటి సమస్యపై ఆమె దృష్టి సారించారు.
నెల్లూరులో ఉన్నప్పటికీ...
తాను నెల్లూరులోని తన ఇంట్లో ఉన్నప్పటికీ కోవూరు నుంచి కార్యకర్తలు వస్తే వెంటనే వారిని కలసి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలతో వస్తే వారికి వైద్య పరంగా కూడా సాయం అందిస్తుండటంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరులో పాతుకుపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మామూలుగానే సేవా కార్యక్రమాలను చేసి రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం కావడంతో ప్రజాసేవలోనూ ముందున్నారని అంటున్నారు. తన భర్త ఎంపీగా బిజీగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన వారికి కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తుండటంతో ఆమె సింహపురి పాలిటిక్స్ లో కీలకంగా మారారు.
టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా...
దీంతో పాటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు కూడా కావడంతో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం సిఫార్సు లేఖలకోసం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వద్దకు వచ్చే వారిలో ఎక్కువ మంది ఆసుపత్రిలో వైద్యం కోసం మాత్రమే కాకుండా మరొక వైపు తిరుమలలో సిఫార్సు లేఖలు కోసం వచ్చే వారే అధికం. ఒకవైపు గృహిణిగా మరొక వైపు రాజకీయ నేతగా కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి డిఫరెంట్ స్టయిల్ లో వెళుతున్నారని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో అన్నారట. అందరూ ఆమెను చూసి నేర్చుకోవాలని, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా పట్టుదల, అంకిత భావం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని చూసి అలవర్చుకోవాలని చెప్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News