కమలాపురం వీర శివారెడ్డి రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారా?
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మల్యే వీర శివారెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మల్యే వీర శివారెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వీర శివారెడ్డి గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వీర శివారెడ్డి మరొకసారి రాజకీయంలో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కమలాపురం నియోజకవర్గం నేతలకు సంకేతాలు ఇచ్చారు. దశాబ్ద కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివ గత కొంత కాలంగా అత్యంత చురుకుగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన తన సన్నిహితులతో తన మనసులో మాట చెప్పారు.
మూడు సార్లు గెలిచి...
వీరశివారెడ్డి1994, 2004లో కమలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు వైసీపీ కంటే టీడీపీతోనే ఎక్కువ సంబంధాలున్నాయి. టీడీపీలో మూడు సార్లు కమలాపురం టిక్కెట్ పొంది ఒకసారి మాత్రం ఓడిపోయారు. అయితే ఆయన టీడీపీలో చేరతారా? లేక మరేదైనా పార్టీలో చేరతారా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే మళ్లీ టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలో రంగంలోకి వస్తున్నా మీరంతా తిరిగి పనిచేయాలంటూ తన అనుయాయులను కోరారంటే ఖచ్చితంగా టీడీపీలో యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది.
టీడీపీలోనూ...
అయితే టీడీపీలోనూ ప్రస్తుతం కమలాపురం టిక్కెట్ ఖాళీ లేదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గెలుపొందారు. మరో బలమైన నేత పుత్తా నరసింహారెడ్డి కుటుంబాన్ని కాదని వీర శివారెడ్డికి టీడీపీలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యత దక్కుతుందన్నది అనుమానమే. వైసీపీలో ఉన్నారా? లేదో తెలియదు. వైసీపీలో ఆయన చేరారు. తర్వాత పార్టీలో యాక్టివ్ గా లేరు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. టిడిపి, బిజెపి, జనసేన కూటమిలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేరితే అంతకు ముందున్న ప్రాధాన్యత లభిస్తుందన్నదా అన్నది సందేహమే. కానీ వీరశివారెడ్డి రాజకీయ రీ ఎంట్రీ ఏ రకంగా ఉంటుందో అన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీర శివారెడ్డికి అనుకూలంగా ఉంటుందో? లేదో? అన్నది భవిష్యత్ లో తేలనుంది.