ఏపీలో దారుణం.. గిరిజన యువకుడి నోటిలో మూత్రం పోసి..మర్మాంగాన్ని..

చాలా రోజులకు ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు మిగతా స్నేహితులతో కలిసి వెళ్లారు. పీకల దాకా మద్యం తాగిన తర్వాత..

Update: 2023-07-19 13:38 GMT

Urinate on Tribal Youth

మొన్న మధ్యప్రదేశ్.. నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు ఆంధ్రప్రదేశ్.. గిరిజనులపై మూత్ర విసర్జన చేసి.. వారిని దారుణంగా హింసించి అవమానించే ఘటన ఆంధ్రప్రదేశ్ లోనూ వెలుగుచూసింది. కొందరు యువకులు గిరిజన యువకుడిపట్ల దారుణంగా, దుర్మార్గంగా ప్రవర్తించారు. పీకలదాకా మద్యం సేవించి.. ముఖంపై మూత్రం పోసి హింసించారు. అంతటితో ఆగకుండా.. మర్మాంగాన్ని నోటిలో పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ దారుణం నెలరోజుల క్రితం ఒంగోలులో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

ఒంగోలుకు చెందిన మోట నవీన్ (గిరిజన యువకుడు), మన్నే రామాంజనేయులు చిన్నప్పటి నుండీ స్నేహితులు. వీరిద్దరూ జులాయిలుగా తిరుగుతూ పలు నేరాలకు పాల్పడినట్లు కేసులున్నాయి. వీరిపై సుమారు 50 కేసులు నమోదయ్యాయి. నవీన్ పోలీసులకు చిక్కగా.. రామాంజనేయులు పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. గతంలో నవీన్, రామాంజనేయులు మధ్య ఓ అమ్మాయి విషయమై గొడవ జరిగింది. ఆ గొడవే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది.
చాలా రోజులకు ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు మిగతా స్నేహితులతో కలిసి వెళ్లారు. పీకల దాకా మద్యం తాగిన తర్వాత.. ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మాటకు మాట పెరిగి కొట్టుకునేంతవరకూ వెళ్లగా.. నవీన్ ను రామాంజనేయులు, మిగతా స్నేహితులు కొట్టి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయిన అతని నోటిలో ముగ్గురు మూత్రం పోసి, మర్మాంగాన్ని బలవంతంగా నోటిలో పెట్టేందుకు ప్రయత్నించి.. దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుడు తనకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు కానీ.. నిందితులను అరెస్ట్ చేయలేదు. విషయం తెలిసి గిరిజనులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News