YSRCP : రాజకీయ కుట్ర కాక మరేంటి : సజ్జల
వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రలకు దిగారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రలకు దిగారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది నాటి ప్రభుత్వంలోనే అని తెలిపారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. తర్వాత కెమికల్ కలిపారంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారని అన్నారు. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు తాము ఆర్థికంగా లాభపడేందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
హిందువుల మనోభావాలను...
కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వారు వ్యవహరించారన్నారు. అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా, మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని అర్థమవుతుందని చెప్పారు. అధిక ధరలకు నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టును తన అనుయాయులకు చంద్రబాబు కట్టబెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజలు అన్ని తెలుసుకుంటున్నారని, ఎవరు ఇందులో దోషులో కాలమే నిర్ణయిస్తుందని, సిట్ కూడా తేలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.