తిరుమలలో కేంద్రమంత్రి

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దర్శించుకన్నారు

Update: 2022-11-16 07:12 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దర్శించుకన్నారు. కేంద్రమంత్రికి ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ప్రత్యేకంగా మంత్రికి దర్శనం ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలకడమే కాకుండా వేదపండితులు వేద ఆశీర్వచనాలను అందచేశారు.

వేద ఆశీర్వచనాలతో...
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో గజేంద్ర షెకావత్ వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి, రెడ్డప్ప, టీడీపీ మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డిలు ఉన్నారు.


Tags:    

Similar News