ఇద్దరు ఐపీఎస్ లకు హైకోర్టులో ఊరట

ముంబయి నటి వేధింపుల కేసులో ఇద్దరు ఐపీఎస్‍లకు హైకోర్టులో ఊరట లభించింది

Update: 2025-05-08 07:22 GMT

ముంబయి నటి వేధింపుల కేసులో ఇద్దరు ఐపీఎస్‍లకు హైకోర్టులో ఊరట లభించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంతిరాణా, విశాల్ గున్నీలకు ముంబయి నటి కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో వారిద్దరికీ ఊరట లభించినట్లయింది.

సీఐడీప నోటీసులివ్వడంతో...
ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీలు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు హాజరు కాకుండా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.


Tags:    

Similar News