టీటీడీ ఉద్యోగులతో చర్చలు విఫలం

టీటీడీ ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారుల చర్చలు విఫలమయ్యాయి

Update: 2025-02-21 03:32 GMT

టీటీడీ ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారుల చర్చలు విఫలమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో వెంకయ్యచౌదరి, జేఈవోలు వీరబ్రహ్మంలు చర్చలు జరిపారు. టీటీడబీ ఉద్యోగిపై దురుసుగా వ్యవహరించిన బోర్డు సభ్యుడు నరేష్‍ను తొలగించాలంటున్న ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన కు దిగిన సంగతి తెలిసిందే.

నరేష్ ను తొలగించేంత వరకూ...
నరేష్‍ను తొలగించే వరకు పోరాటం ఆపేది లేదంటూ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. నేడు , రేపు మౌన దీక్షలకు టీటీడీ ఉద్యోగ సంఘాల పిలుపును ఇచ్చాయి. అయితే నరేష్ ను తొలగించడం టీటీడీ బోర్డు చేతిలో ఉందా? లేదా? అన్నది కూడా పరిశీలించాలని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని నచ్చ చెప్పినా ఫలితం లేదు.


Tags:    

Similar News