అన్నప్రసాదంలో కొత్త మెనూ.. రుచికరంగా ఉన్న వటిని లొట్టలేసుకుంటూ
తిరుమలకు వచ్చే భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది.
తిరుమలకు వచ్చే భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం మెనూలో టీటీడీ అధికారులు మార్పులు చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసింది.
మసాలా వడలు...
ఈరోజు అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు ఐదు వేల మంది భక్తులకు మసాలా వడలు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది వడ్డించారు. మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.