Tirumala : తిరుమలలో రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం

నేటి నుంచి శ్రీవారి మెట్టు వద్ద దర్సన టోకెన్ల జారీ నిలిపివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-06-06 04:22 GMT

నేటి నుంచి శ్రీవారి మెట్టు వద్ద దర్సన టోకెన్ల జారీ నిలిపివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోభక్తుల రద్దీ పెరగడంతో దర్శన టోకెన్లు జారీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ చేస్తుంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ల జారీ ప్రారంభం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

టోకెన్ల జారీ నిలిపివేత...
నేటి సాయంత్రం టోకెన్లు పొందిన భక్తులకు రేపటికి శ్రీవారి దర్శనం అవుతుంది. ఇందుకోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రత్యేకంగా పది కౌంటర్ల ఏర్పాటు చేసింది.టోకెన్లు పొందిన భక్తులకు ఉచిత బస్సులను అందుబాటులో ఉంచుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారిమెట్టు మార్గంలోని పన్నెండు వందల మెట్టు వద్ద స్కానింగ్ తప్పనిసరి అని చెప్పింది.


Tags:    

Similar News