తనపై ఉన్న ప్రేమను జగన్ నిరాకరించడం లేదు : విజయమ్మ

షర్మిలకు తాను బినామీని కాదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు

Update: 2026-03-18 02:51 GMT

షర్మిలకు తాను బినామీని కాదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదంటూ వైఎస్‌ విజయమ్మ చెప్పారు. జగన్ దంపతులు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు కూడా ప్రయోజనం ఉందని ఆమె తెలిపారు. తన పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించడం లేదని విజయమ్మ తెలిపారు.

షర్మిలకు నేను బినామీని కాదు...
ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ కు విజయమ్మ తెలిపారు. విజయమ్మ, జనార్ధన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దాని ప్రకారం రిజిస్టర్ లో సభ్ుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీలు హైదారబాద్ ఎన్సీఎల్టీలో పిటీషన్ వేశారు. ఈ తీర్పు చట్ట విరుద్ధమంంటూ సరస్వతి పవర్ లిమిటిడ్, వైఎస్ విజయమ్మ చెన్నై ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ చేశారు. విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News