చిత్తూరులో ఏనుగుల దాడిలో రైతు మృతి
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద ఏనుగులు దాడి చేశాయి.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రైతు కిట్టప్పమృతిచెందారు. కిట్టప్ప వయసు డెబ్భయి ఏళ్లు. పొలం వద్ద రాత్రి కాపలా కాస్తుండగా రైతుపై దాడి చేసిన ఏనుగులు అతనిని తొక్కి చంపేశాయి. దీంతో ఉదయం చూసిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
కుంకీ ఏనుగులతో...
ఘటనాస్థలిని పరిశీలించిన అటవీ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఏనుగులు గుంపులుగా వచ్చిపంట పొలాలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏనుగులు జరిపిన దాడిలో రైతు మరణించడంతో ఇకనైనా కుంకీ ఏనుగులతో తమ పొలాలను, తమను రక్షించాలని రైతులు కోరుతున్నారు.