Tirumala : వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు తిరుమల, తిరుపతిలో విక్రయం..ఎప్పటి నుంచి అంటే

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది.

Update: 2023-12-02 06:23 GMT

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం తెరిచి ఉంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

నాలుగు లక్షల...
ఇందుకోసం తిరుపతి, తిరుమలలో టోకెన్లు ఇస్తామని ఆయన చెప్పారు. డిసెంబరు 22 నుంచి పది కేంద్రాల్లో 4,23,500 టోకెన్లను ఇవ్వనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే లక్షల మంది ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. పది రోజుల పాటు జరగనున్న ఈ దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.



Tags:    

Similar News