తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్

తాడిపత్రిలో నేడు టెన్షన్ నెలకొంది. భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Update: 2026-01-23 04:23 GMT

తాడిపత్రిలో నేడు టెన్షన్ నెలకొంది. భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు - ప్రతి సవాళ్ల మధ్య నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ పౌరుషంపై చర్చకు రావాలంటూ ఇద్దరూ ఒకరికొకరు సవాళ్లు విసరుకున్నారు. తాడిపత్రిలో చర్చకు సిద్ధమని ఇరు వర్గాలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రెండు వర్గాల మొహరిస్తాయని...
దీంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకే చర్చకు వస్తానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దీంతో తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అయితే నారాలోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా తాము కార్యక్రమాలు చేసుకోవడానికి వస్తున్నామని జేసీ వర్గీయులు చెబుతున్నారు. మొత్తం మీద తాడిపత్రిలో ఏం జరుగుతుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది.


Tags:    

Similar News