తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బుక్కాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్నారు

Update: 2025-08-19 07:19 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బుక్కాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. తాడిపత్రికి వెళతారన్న అనుమానంతో ఆయనను పోలీసులు నిలిపేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సొంత గ్రామమైన తిమ్మంపల్లి నుంచి అనంతపురం వెళుతున్న తనను అడ్డుకోవడమేంటని పెద్దారెడ్డి పోలీసులను ఈ సందర్భంగా నిలదీశారు.

బుక్కాపురం వద్ద అడ్డుకున్న పోలీసులు...
తాను అనంతపురానికి వెళుతున్నా పోలీసులు అనుమతించడం లేదని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పెద్దారెడ్డి పోలీసుల పై మండిపడ్డారు. నిన్న తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించగా పోలీసులు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆయనను అనుమతించలేదు. నేడు హైకోర్టులో పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రవేశించనివ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పోలీసులు లంచ్ మోషన్ పిటీషన్ వేశారు.


Tags:    

Similar News