నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు...రాత్రికి నిషేధం

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు

Update: 2025-02-15 02:36 GMT

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత కనిపించడంతో తిరుమల తరుపతి దేవస్థానం వెంటనే చర్యలు తీసుకుంది. అధికారులు చిరుత బారిన భక్తులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.

నడక మార్గంలో...
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గంలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ మాత్రమే అనుమతిస్తున్నారు. ఒక్కో బ్యాచ్ లో డెబ్భయి నుంచి వంద మంది వరకూ గుంపులుగా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. పన్నెండేళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతికి అధికారుల నిరాకరిస్తున్నారు. రాత్రి 9.30 గంటలకు చిరుత సంచారంతో అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు.


Tags:    

Similar News