TDP : ఈ నెల29న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

ఈనెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

Update: 2025-06-27 02:10 GMT

ఈనెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే నెల రెండో తేదీ నుంచి ఇంటింటికి మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్లేందుకు ప్లాన్ చేసింది. ఏడాది పాలనపై తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, హామీలతో పాటు అన్ని ప్రజలకు వివరించనున్నారు.

ఏడాది పాలనపై....
ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జులు, పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ప్రజల్లోకి వెళ్లడమేకాకుండా ఇంటింటికి అందుతున్నపథకాలను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేయనున్నారు


Tags:    

Similar News