TDP : కడప జిల్లాలో టీడీపీకి షాక్.. కీలక నేత జంప్
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగలనుంది. సీనియర్ నేత పార్టీని వీడనున్నారు
tdp, candidate, mlc of local bodies, visakha district
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగలనుంది. సీనియర్ నేత పార్టీని వీడనున్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కమలాపురం టిక్కెట్ ను వీర శివారెడ్డి ఆశించారు.
టిక్కెట్ రాకపోవడంతో...
అయితే టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు అమ్ముడుపోయారంటూ దుమ్మెత్తిపోశారు. ఈ ఏడాది జనవరిలోనే పార్టీలో చేరిన వీరశివారెడ్డి వైసీపీలో చేరుతుండటంతో ఆ నియోజకవర్గంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. నేడు నామినేషన్ వేయడానికి జగన్ పులివెందుల వస్తున్న సందర్భంలో ఆయన సమక్షంలో తిరిగి వైసీపీలో చేరేందుకు ఆయన తన అనుచరులతో కలసి పులివెందులకు రానున్నారు.