TDP : నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

నేడు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

Update: 2025-06-29 02:06 GMT

నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. జులై 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో నేతలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

ఇంటింటికీ తొలి అడుగు....
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది లోపే ఇచ్చిన హామీలలో అనేకం అమలు చేశామని, సూపర్ సిక్స్ హామీల్లో దాదాపుగా నెరవేర్చామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు నెల రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పనున్నారు.


Tags:    

Similar News