Andhra Pradesh : నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు.
వర్షాకాల సమావేశాల్లో...
వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సభలో మాట్లాడాలని, సమస్యలను గురించి ప్రస్తావించాలని చెప్పనున్నారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి సభలో విజ్ఞప్తి చేయాలని కోరనున్నారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు విధిగా సమావేశాలకు హాజరై రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాలని కోరనున్నారు.