TDP : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది

Update: 2025-03-10 01:44 GMT

satyanarayana passed away

తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసింది. సామాజికవర్గాల సమీకరణ ఆధారంగా, ప్రాంతాల వారీగా ఈ ఎంపిక జరిగిందనే చెప్పాలి. మాజీ స్పీకర్ కుమార్తె కావలి గ్రీష్మ, బీద రవి చంద్ర, బీటీ నాయుడులను ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ పదవీ విరమణ చేసిన వారిలో ఒక్క బీటీ నాయుడుకు మాత్రమే టీడీపీ అధినాయకత్వం రెన్యువల్ చేసింది.

నేడు నామినేషన్లు...
ఈ ముగ్గురు నేడు నామినేషన్లు వేయనున్నారు. బలహీన వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసి తాము వారికి ప్రాధాన్యత ఇస్తామన్న సంకేతాలను పంపగలిగింది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేన, మరొకటి బీజేపీకి పోగా మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. దీంతో శాసనమండలిలో ఐదుగురు కూటమి సభ్యులు కొత్తగా చేరనున్నారు.


Tags:    

Similar News