Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2023-11-26 02:57 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలిసింది. అందుతున్న సమాచారం ప్రకారం తన న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కూడా వెళతారని తెలుస్తోంది.

శస్త్రచికిత్స తర్వాత...
సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకునే చంద్రబాబు ఆరోజు సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ లో పొల్గొంటారు. రాత్రికి డిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకుంటారు. చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత తొలి పర్యటన ఇదే. ఆయన కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది.


Tags:    

Similar News