Breaking : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే... అధికారిక ప్రకటన
తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది.
tdp, candidate, mlc of local bodies, visakha district
తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ప్రకటించింది. గత ఎన్నికల్లో తెనాలి శాసనసభ టిక్కెట్ ను జనసేనకు త్యాగం చేసినందుకు ఆయనకు ఈ ఎమ్మెల్సీ సీటు లభించింది.
పేరాబత్తుల రాజశేఖర్ ఎవరంటే?
ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేరును ప్రకటించింది. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలానికి చెందిన రాజశేఖర్ గతంలో ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల కమిటీ పర్యవేక్షకుడిగా రాజశేఖర్ వ్యవహరించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ టిక్కెట్ ను కోరారు. అయితే అది జనసేనకు కేటాయించడంతో ఆయనకు ఈ పదవి ఇచ్చారు.