Revanth Reddy : నేడు జనగామ జిల్లాకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లా పర్యటనకు రానున్నారు

Update: 2025-03-16 03:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లా పర్యటనకు రానున్నారు. జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ శివుని పల్లెకు చేరుకుని వివిధ అధికారిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. శంకుస్థాపనలను చేయనున్నారు. ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకుంటారు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు...
తొలుత శివునిపల్లెకు చేరుకోని ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ను పరిశీలించనున్నారు. ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News