Nara Lokesh : నేడు గవర్నర్ ను కలవనున్న లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు
acb court seeking permission to arrest nara lokesh
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదవుతున్న అక్రమ కేసులపై గవర్నర్ కు లోకేష్ ఫిర్యాదు చేయనున్నారు.
వరసగా నమోదవుతున్న....
చంద్రబాబుపై వరసగా నమోదవుతున్న కేసుల గురించి గవర్నర్ కు లోకేష్ వివరించనున్నారు. గత కొద్దిరోజులుగా ఏపీలో విపక్షాలపై పాలకపక్షం అనుసరిస్తున్న వైఖరిని కూడా ఆయన గవర్నర్ కు తెలపనున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు నుంచి నిన్నటి ఇసుక కేసు వరకూ ప్రభుత్వం దిగుతున్న కక్ష సాధింపు చర్యల గురించి లోకేష్ వివరించనున్నారు.