ఉద్యోగులకు ఒకటోతేదీనే జీతాలు కావాలా?
మంగళగిరి మండలం కాజాలోని అపార్ట్ మెంట్ వాసులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అయ్యారు
nara lokesh
మంగళగిరి మండలం కాజాలోని అపార్ట్ మెంట్ వాసులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అయ్యారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తామని ఆయన తెలిపారు. అదృశ్యమైన అమ్మాయిల ఆచూకీ గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.
పరిశ్రమలను స్థాపించి...
సీఐఐతో చర్చించి పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామికవేత్తలకు రాయితీలను చట్టబద్దం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.