Akhila Priya : అఖిలప్రియ సవాల్ విన్నారా?
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ తనపై విమర్శలు చేసిన వారికి సవాల్ విసిరారు
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ తనపై విమర్శలు చేసిన వారికి సవాల్ విసిరారు. ఆళ్లగడ్డ మండలంలోని పుణ్యక్షేత్రంలోని అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడినట్లునిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ నాయకులు తనపై పదే పదే ఆరోపణలు చేశారన్నారు.
అక్రమ వసూళ్లకు...
తాను అక్రమ వసూళ్లకు పాల్పడాల్సిన అవసరం లేదని అఖిలప్రియ తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దే ప్రయత్నంలోనే తాను ఉన్నానని తెలిపారు. వారి అక్రమాలను వెలికి తీస్తున్నానన్న కక్షతో తనపై లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.