TDP : తిరువూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం

తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది

Update: 2025-06-02 06:42 GMT

తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ గా టీడీపీకి చెందిన నిర్మల ఎన్నికయ్యారు. గత రెండుసార్లు తిరువూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. అయితే వైసీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోవడంతో ఇక టీడీపీ అభ్యర్థిని ఎన్నికకు మార్గం సుగమమయింది.

గత రెండు సార్లుగా...
తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక కోసం వైసీపీ, టీడీపీలు గత రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. కోరం లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. చివరకు టీడీపీ నేతలు వైసీపీ నుంచి కౌన్సిలర్లను తమ పార్టీలోకి తెప్పించుకునే విషయంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈరోజు టీడీపీ కైవసం చేసుకుంది. తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు


Tags:    

Similar News