Chandrababu : ఎవరికీ మినహాయింపుల్లేవ్... నివేదికలు తెప్పించుకుంటా : చంద్రబాబు
నెలరోజులు ఎవరికీ విశ్రాంతి లేదని, ఇంటింటికి తొలి అడుగుకార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
నెలరోజులు ఎవరికీ విశ్రాంతి లేదని, ఇంటింటికి తొలి అడుగుకార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరును తాను ఎప్పటికప్పుడు తెలుసుకుని బేరీజు వేసుకుంటూ అవసరమైన సమయంలో చెబుతానని చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పారు. అన్నిపనులు పక్కన పెట్టి నెలరోజుల పాటు ప్రతి ఇంటి గడప తొక్కాలని, ప్రభుత్వం ఏడాదిగా అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను గురించి వివరించాలని చంద్రబాబు తెలిపారు.
ఎవరు ఏం చేస్తున్నారో?
ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, ముందుగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజల్లో ఉంటూ వారితో మమేకమవుంటేనే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని అన్నారు. లేకుంటే మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని తెలిపారు. ఏడాది కాలంలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి బయటపడేసి సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళుతున్నామని, శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రజలకు వివరించాలని చంద్రబాబు తెలిపారు. అలా కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే ప్రజలు కూడా క్షమించరని గుర్తు చేశారు. స్మార్ట్ వర్క్ తో పనిచేస్తూ ప్రజలకు చేరువ అవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు అన్నారు.