Chandrdababu : ఈరోజు బయటకు వస్తారా?

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇస్తూ తీర్పు చెప్పడంతో ఈరోజు సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశముంది

Update: 2023-10-31 05:49 GMT


స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇస్తూ తీర్పు చెప్పడంతో ఈరోజు సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశముంది. కోర్టు ఆర్డర్స్ బయటకు వచ్చిన వెంటనే జైలు అధికారులకు చంద్రబాబు తరుపున న్యాయవాదులు సమర్పించాల్సి ఉంటుంది. అంతా సక్రమంగానే జరిగితే ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తారని ఆయన తరుపున న్యాయవాదులు చెబుతున్నారు.

కండిషన్‌లు ఇవే...

చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గత యాభై రెండు రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల సెక్యూరిటీ చెల్లించాలని షరతు పెట్టింది. ఎక్కడైనా ఆయన చికిత్స చేయించుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. కోర్టు ఆర్డర్ కాపీలు రావడం లేటయితే రేపు ఉదయం బయటకు వచ్చే అవకాశముంది. 

Tags:    

Similar News